భారతదేశం, సెప్టెంబర్ 2 -- డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఫీమేల్ సూపర్ హీరో చిత్రం లోకా: చాప్టర్ 1-చంద్ర ఆగస్టు 28న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. దీంతో మూవీ కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఫస్ట్ మండే కూడా మంచిగానే వసూళ్లు రాబట్టింది.

సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం లోకా సోమవారం (సెప్టెంబర్ 1) ఇండియాలో రూ.6.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో ఈ మూవీ అయిదు రోజుల నెట్ కలెక్షన్లు రూ .31.05 కోట్లకు చేరుకున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మందగించే అవకాశం ఎలాగో ఉంటుంది. కానీ మండే కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి.

గురువారం రూ.2.7 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన లోకా చాప్టర్ 1 మూవీ దీం...