భారతదేశం, డిసెంబర్ 3 -- ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. తెలుగులో ఇది 'అమర కావ్యం' పేరుతో రిలీజైంది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో దూకుడు కొనసాగిస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా ధనుష్ కు 2025లో బిగ్గెస్ట్ హిట్ గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ధనుష్ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో అమర కావ్యంతో రిలీజైన ఈ మూవీ అయిదు రోజు (డిసెంబర్ 2) ఇండియాలో రూ.10.25 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ కలెక్షన్లు సాధించినట్లు ట్రేబ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ తెలిపింది. దీంతో అయిదు రోజుల కలెక్షన్లు రూ.71 కోట్లకు చేరాయి.

తేరే ఇష్క్ మే మూవీ శుక్రవారం (నవంబర్ 28) రిలీజైంది. ఇది ఫస్ట్ డే రూ.18 కోట్లతో మంచి ఓపెనింగ్ సాధించింది. శనివారం రూ.17 కోట్లు, ఆదివారం రూ.19...