భారతదేశం, ఆగస్టు 2 -- జనతాదళ్ (సెక్యులర్) నేత, హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయనపై హోళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదైంది. ఇంట్లో పలుమార్పు పనిమనిషి మీద అత్యాచారం చేసినట్టుగా కేసు ఉంది.

శిక్షకు ముందు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ న్యాయవాదులు ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని వాదించారు. లైంగిక దాడి, అత్యాచారం నాలుగు కేసుల్లో ప్రజ్వల్ ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తీర్పు వెలువరించారు.

హసన్ జిల్లా హోళెనరసిపురలోని రేవణ్ణ కుటుంబం ఫాంహౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళకు సంబంధించిన కేసు ఇది. అత్యాచారం కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్ రేవణ్ణ తనకు తక్కువ శిక్ష విధించాలని కోరారు. కోర్టు వద్ద బోరున ఏడ్చాడ...