భారతదేశం, జనవరి 11 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చి చరిత్ర సృష్టించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాను స్టార్ మా ప్రీమియర్ చేయబోతోంది. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించిన సినిమా లోకా: ఛాప్టర్ 1. తెలుగులో కొత్త లోక పేరుతో వచ్చింది. ఈ సినిమాను ఆదివారం (జనవరి 11) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ప్రీమియర్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఒక లోకం. ఒక పోరాటం. అంతులేని పరీక్షలు.. ది రైజ్ ఆఫ్ చంద్ర రేపే ప్రారంభమవుతోంది. కొత్త లోక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

మలయాళం ఇండస్ట్రీ నుంచి గత...