భారతదేశం, మే 4 -- ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో వెబ్ సిరీస్‍లకు ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రేక్షకులు భారీ స్థాయిలో చూసేస్తున్నారు. అందుకే కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‍లు కూడా భారీ బడ్జెట్‍తో రూపొందుతున్నాయి. ఇప్పటికే గ్రాండ్ లెవెల్‍లో కొన్ని సిరీస్‍లు వచ్చాయి. భారీ బడ్జెట్‍తో వచ్చి అలరించాయి. అలా అత్యంత ఖరీదైన ఐదు భారత వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గ్రాండ్ స్కేల్‍లో 'హీరామండి: ది డైమండ్ బజార్' వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‍కు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఇండియన్ వెబ్ సిరీస్‍గా ఇది ఉంది. ఈ పీరియడ్ డ్రామా వెబ్ సిరీస్ గతేడాది మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 1940ల బ్యాక్‍డ్రాప్‍లో వేశ్యల మధ్య ఆధిపత్య పోరు స్టోరీతో హీరామండి ...