Hyderabad, జూన్ 18 -- రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలుసు కదా. హైదరాబాద్ సమీపంలోని ఈ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ సిటీ అందాలను చూసి ఆశ్చర్యపోని వారు ఎవరూ ఉండరు. కానీ అలాంటి ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్లేస్ గా బాలీవుడ్ నటి కాజోల్ అభివర్ణించడం గమనార్హం. అక్కడ షూటింగ్ చేసే సమయంలో తాను చాలా భయంభయంగా ఫీలైనట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కాజోల్ తన నెక్ట్స్ మూవీ మా (Maa) ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇదొక హారర్ మూవీ. ఇందులో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు చాలా భయం వేసిన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చింది. అలాంటివి చాలా ప్రదేశాలు ఉన్నాయని, అందులో రామోజీ రావ్ స్టూడియోస్ అని చెప్పింది. "చాలాసార్లు అలా జరిగింది. చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాం. షూటింగులు కూడా చేశాం.

రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడి నుంచి బయటపడితే చాలు అనిపించి...