భారతదేశం, ఆగస్టు 30 -- ఇటు మెగా, అటు అల్లు కుటుంబంలో ఒకేసారి తీవ్ర విషాదం అలుముకుంది. పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, చిరంజీవి అత్తయ్య అల్లు కనకరత్నం శనివారం (ఆగస్టు 30) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దివంగత అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సురేఖ సోదరుడు అల్లు అరవింద్. అల్లు అరవింద్ కుమారుడే అల్లు అర్జున్.

అల్లు కనకరత్నం మృతి పట్ల భావోద్వేగానికి గురైన చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ''మా అత్తయ్య గారు... శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందంటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపించిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి'' అని చిరు ప...