భారతదేశం, ఏప్రిల్ 20 -- సోలార్ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు వైవ్ మొబిలిటీ ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఎవా కాంపాక్ట్ సోలార్ ఎలక్ట్రిక్ 2 సీటర్ కారును విడుదల చేసింది. ట్రాఫిక్ రద్దీ, పరిమిత పార్కింగ్ స్థలం, పెరుగుతున్న ఇంధన ఖర్చులు వంటి నగర జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ కారును రూపొందించామని చెప్పింది. దీని ధర, ఇతర వివరాలు చూద్దాం..

ఈ 2-సీటర్ కారును రూ. 3.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. ఈ కారు పూర్తిగా విద్యుత్ శక్తితో నడుస్తుంది. ఛార్జ్ అయిపోయినప్పుడు సౌరశక్తిని ఉపయోగించుకునేలా రూపొందించారు. అదనపు సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం వలన ఇది సాధ్యమవుతుంది.

భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అయిన వేవ్ ఎలక్ట్రిక్ ఎవా మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎవా నోవా, ఎవా స్టెల్లా, ఎవా వేగా. సింగిల్‌ ఛార్జ్‌కి 250 కి....