భారతదేశం, నవంబర్ 25 -- ట్రేడింగ్ ప్రపంచంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు... అధిక ట్రేడింగ్ (Overtrading), రివెంజ్ ట్రేడింగ్ (Revenge Trading). ఈ తప్పుల వల్ల నష్టాలు కొని తెచ్చుకునే ట్రేడర్‌లకు జెరోధా సహ-వ్యవస్థాపకుడు (Co-founder) నితిన్ కామత్ (Nithin Kamath) ఓ అద్భుతమైన పరిష్కారాన్ని అందించారు.

ట్రేడింగ్ ఆపాలనుకున్నా, మనసు మాట వినకుండా ట్రేడింగ్ కొనసాగించేవారికి తమ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న 'కిల్ స్విచ్' (Kill Switch) ఫీచర్ చాలా ఉపయోగపడుతుందని ఆయన మంగళవారం ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపారు.

"నేను ట్రేడర్‌గా ఉన్న అన్ని సంవత్సరాలలో, అలాగే బ్రోకరేజీని నడుపుతున్న అనుభవంలో, పదేపదే చూసిన అత్యంత సాధారణ ట్రేడింగ్ పొరపాటు అధిక ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్" అని నితిన్ కామత్ తన ఎక్స్ పోస్ట్‌లో స్పష్టంచేశారు.

కొన్నిసార్లు మనం తీసుకోని ట్రేడే అత్య...