భారతదేశం, డిసెంబర్ 8 -- టెలివిజన్ నటుడు గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 రియాలిటీ షో విజేతగా నిలిచాడు. ఈ హిందీ బిగ్ బాస్ సీజన్ టైటిల్ ను గెలుచుకున్నాయి. అయితే సెకండ్ ప్లేస్ లో నిలిచి, రన్నరప్ గా మిగిలిన ఫర్హానా భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ టైటిల్ కు గౌరవ్ అర్హుడే కాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఫర్హానా.

బిగ్ బాస్ 19 హిందీ విన్నర్ పట్ల వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫర్హానా గెలుపుకు అర్హురాలని భావిస్తుంటే, మరికొందరు గౌరవ్ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ఫిల్మీగ్యాన్ తో ఒక ఇంటర్వ్యూలో ఫర్హానా ఇప్పుడు గౌరవ్ ను 'అనర్హుడు' అని పేర్కొంది. ఫర్హానా భట్ అభిప్రాయం ప్రకారం గౌరవ్ ఖన్నా అర్హత గల విజేత కాదు.

ఫర్హానా బిగ్ బాస్ 19 లో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "నేను నిజంగా సంతృప్తిగా ఉన్నాను. నా చేతిలో ట్రోఫీ లేకపోయినా...