Hyderabad, జూలై 28 -- బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ చెల్లెలు అయిన పరిణీతి చోప్రా ప్రముఖ పొలిటిషియన్ రాఘవ్ చద్ధాను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ జంట ప్రముఖ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్‌కు హాజరై సందడి చేయనుంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి గెస్టులుగా వచ్చే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో కామెడీతో ఆకట్టుకుంది. ఇందులో రాఘవ్ చద్దా చెప్పులు లేకుండా వస్తే.. "పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పులు లేకుండా షోకి వస్తానని మొక్కుకున్నారా ఏంటీ" అని హోస్ట్ కపిల్ దేవ్ పంచ్ వేశాడు.

"లేదు, బయట నా చెప్పులు ఎవరో దొంగలించారు" అని రాఘవ్ చద్దా చెప్పాడు. తర్వాత లేడి గెటప్పులో ఉండే...