Hyderabad, ఆగస్టు 4 -- ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం, వాటికి వచ్చే కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం వింటున్నాం. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అతడు రీ రిలీజ్ కాబోతుంది.

ఈ విషయాన్ని ఇటీవల మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి మరి అతడు రీ రిలీజ్ డేట్ గురించి ప్రకటించారు. అతడు సినిమా 2005లో ఆగస్ట్ 10న థియేట్రికల్ రిలీజ్ కాగా ఇప్పుడు మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయనున్నారు. అభిమానులకు కానుకగా మహేశ్ బాబు పుట్టినరోజు నాడే అతడు 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ కానుంది.

ఇప్పటికే మహేశ్ బాబు సినిమాలు అయిన ఖలేజా, మురారి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు, పోకిరి రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయితే, అతడు మూవీ మాత్రం రీ రిలీజ్‌కు మ...