భారతదేశం, జనవరి 23 -- 'ధూమ్', 'హంగామా', 'ఫిర్ హేరా ఫేరీ' వంటి సూపర్ హిట్ సినిమాలతో 2000వ దశకంలో కుర్రకారు మనసు గెలుచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రిమీ సేన్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ రిమీ సేన్ సినిమాలకు దూరంగా ఉంటూ, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రిమీ సేన్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ స్టార్ హీరోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎవరైనా తమ పరిమితులను (Limitations) గుర్తించి పనిచేస్తే జీవితంలో చాలా దూరం వెళ్తారని రిమీ సేన్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను రిమీ సేన్ ప్రస్తావించారు.

"కెరీర్ మొదట్లో జాన్ అబ్రహం ఒక మోడల్. అతనికి నటన అస్సలు తెలియదు. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా ఆయన ఎప్పుడూ నోరు విప్పలేదు. తన నటన కంటే బాడీ, లుక్స్ హైలైట్ అయ్యేలా జాగ్ర...