భారతదేశం, మే 12 -- ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో కూడా పాకిస్థాన్‌పై భారత్ నిఘా ఉంచుతుందని అన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఉంటుందన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే గుణపాఠం నేర్పిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అణ్వాయుధాల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడాన్ని భారతదేశం సహించదని అన్నారు.

'ఖచ్చితంగా ఇది యుద్ధ యుగం కాదు, అలాగే ఉగ్రవాద యుగం కూడా కాదు. పాకిస్థాన్‌ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ భారతదేశం పాకిస్థాన్‌ ఛాతీపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయమైన చర్య.' అని ప్రధాని మోదీ అన్నారు.

నేటి పరిస్థితిలో ప్రపంచం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఉగ్రవాదాన్ని కూడా కోరుకోవడం ...