భారతదేశం, జూన్ 5 -- ఓ వైపు వివాదం.. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబో.. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చిన 'థగ్ లైఫ్' మూవీ అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మణిరత్నం మ్యాజిక్, కమల్ హాసన్ స్వాగ్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ ను అలరిస్తోంది. జనాలతో విజిల్స్ కొట్టిస్తోంది. గురువారం (జూన్ 5) రిలీజైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సత్తాచాటింది.

38 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ థియేటర్లలో అదరగొడుతోంది. ఈ తమిళ్ ఒరిజినల్ సినిమా.. తెలుగు, హిందీ భాషల్లోనూ డబ్ అయింది. ఫస్ట్ రోజు కేవలం తమిళ్ లోనే రూ.5.3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇందులో 2డీ వర్షన్ రూ.5.25 కోట్లు కాగా.. ఐమాక్స్ 2డీ రూ.11.63 లక్షలు, 4డీఎక్స్ రూ.70.470.

సక్నిల్క్ వెబ...