భారతదేశం, జనవరి 11 -- సంక్రాంతి సినిమా.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్.. మధ్యలో గెస్ట్ గా వస్తున్న విక్టరీ వెంకటేశ్.. ఇంకేం పండగంతా థియేటర్లలోనే ఉండబోతోంది. మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజా సాబ్‌కు వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలు కూడా చిరుకి కలిసి వస్తున్నట్లుగా ఉంది.

చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లోనే బుక్ మై షోలో ఏకంగా లక్షా 8 వేలకుపైగా టికెట్లు అమ్ముడు పోవడం విశేషం.

ప్రస్తుతం ఈ పోర్టల్ లో మూవీ ట్రెండింగ్ లో ఉంది. సుమారు 2.84 లక్షల మంది మూవీపై ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు కూడా గంటకు సగటును 11 వేల టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఈ సినిమాను ఫ్యామిలీ, థ...