భారతదేశం, అక్టోబర్ 7 -- తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒకరు అంటుంటే.. నేను అలా అనలేదని మరొకరు చెబుతున్నారు. తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ విధించగా.. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివాదంపై మాట్లాడారు. అడ్లూరి వ్యాఖ్యలపై తాను స్పందించనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు తనతో మాట్లాడారని, అదే ఫైనల్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రహ్మత్‌నగర్ భేటీలో ఏం జరిగిందో ఆయనకు తెలిపినట్టుగా వెల్లడించారు. 'అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై నేను స్పందించను. పార్టీ పరంగా మాకు మహేశ్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యం.' అని పొన్నం చెప్పారు.

తనపై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసింద...