భారతదేశం, మే 23 -- ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు పరేషాన్ అవుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ అడవులపై కూడా భద్రతా బలగాలు పట్టు సాధిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. చుట్టుముట్టేశాయి. రోజురోజూకు చొచ్చుకెళ్తున్నాయి. ఈ సమయంలో మావోయిస్టులు అష్టదిగ్బంధంలో చిక్కుకుపోయారనే ప్రచారం జరుగుతోంది.

అసలే వయోభారం.. ఆపై అనారోగ్యం.. నలువైపుల నుంచి తరుముకొస్తున్న భద్రతా బలగాలతో.. మావోయిస్టు అగ్రనేతలు కూడా కకావికలం అవుతున్నారు. బస్తర్‌లో బలగాల నిర్బంధం ఉద్ధృతమవుతున్న పరిస్థితుల్లో అక్కడే ఉండలేక.. బయటికి వెళ్లే మార్గం దొరకని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే బలగాల ఎదుట లొంగిపోవడం.. లేదంటే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడమే వారి ముందున్న మార్గాలు అని పోలీసులు చెబుతున్నారు.

రెండ్రోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస...