భారతదేశం, జనవరి 26 -- హైదరాబాద్: అక్షరం అడవి పువ్వు పరిమళాన్ని అద్దుకుంటే.. కలం గిరిజన గుండె చప్పుడై మోగితే.. అది 'కొండమల్లు' అవుతుంది. 12వ శతాబ్దపు చెంచుల వీరత్వాన్ని, వారి సామాజిక సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేస్తూ రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన 'కొండమల్లు' నవల సాహిత్య లోకంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నాడు ఈ నవలా ఆవిష్కరణోత్సవం కన్నుల పండువగా సాగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు నవలను ఆవిష్కరించి ప్రసంగించారు. "సాధారణంగా నవలలు రాజుల వైభవం, రాజ్యకాంక్ష, యుద్ధాల చుట్టూ తిరుగుతాయి. కానీ, అట్టడుగున ఉన్న గిరిజన సామాజిక జీవన చిత్రణను ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడం గొప్ప విషయం. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన మూడు పుస్తకాలను ...