Hyderabad, మే 13 -- మన దేశంలో వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి. వాటిని చూసేందుకు ఉత్సుకత చూపించే వారి సంఖ్య కూడా ఎక్కువే. పక్షులు, జంతువులను చూసేందుకు ప్రత్యేకంగా ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

ఈ వేసవి సెలవుల్లో మీరు ఏనుగులు చూసేందుకు వెళ్లాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన ఐదు ప్రదేశాలకు వెళ్ళండి. ఈ ప్రదేశాలలో మీరు ఏనుగులు తిరుగుతుండుగా చూస్తూ ఆనందించవచ్చు.

జూకి వెళితే ఏనుగు కనబడుతుంది.. కానీ అక్కడ అంతా కృత్రిమంగా అనిపిస్తుంది. అవి సహజంగా తాము నివాసం ఉండే ప్రాంతాల్లో ఎలా ఉంటాయో, ఎలా తిరుగుతాయో చూస్తేనే బాగుంటుంది. కాబట్టి కొన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. వాటిలో మీరు జీపులలో కూర్చుని ఏనుగులు నివసించే చోటకు వెళ్లి సందర్శించవచ్చు. మన దేశంలోనే ఐదు ప్రదేశాలు ప్రముఖమైనవి. ఇక్కడ మీరు ఏనుగులు తమ నివాస స్థలాల్లో తిరుగుతూ ఉంటే చూసి ఆనందించవచ్చు. ...