భారతదేశం, నవంబర్ 19 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దండకారణ్యం కేంద్రంగా పని చేసే హిడ్మా. ఏవోబీలో ఎన్ కౌంటర్ కావటం సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్ దాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు.. తలదాచుకునే ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇందులో భాగంగానే హిడ్మా దళం ఏవోబీకి వచ్చారని తెలుస్తోంది. అయితే నిఘా విభాగాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు. హిడ్మాను ఎన్ కౌంటర్ చేశాయి. అయితే ఈ ఘటనలో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా.. పోలీసులకు కీలక సమాచారం అందింది.

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ అయిన కొద్దిగంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు విసృత తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా ఓ భవనంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ కావటం చర్చనీయాంశంగా మారింది. వీర...