Hyderabad, ఆగస్టు 4 -- ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు తమ బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం మధురమైన నోట్‌ను పంచుకుంది మిల్కీ బ్యూటి తమన్నా భాటియా.

సినీ ఇండస్ట్రీలో తన కో స్టార్స్, హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, యంగ్ బ్యూటి రాషా తడానీ ముగ్గురు తమన్నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఆగస్ట్ 3న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు గ్లామర్ బ్యూటి తమన్నా విషెస్ తెలియజేసింది.

అంతేకాకుండా తోటి హీరోయిన్లు అయిన మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, రాషా తడానీతో కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది...