భారతదేశం, జూన్ 27 -- విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ టీమిండియా స్టార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడతారు. అలాంటిది టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వీళ్లు కేవలం వన్డేల్లోనూ ఆడబోతున్నారు. వన్డే జెర్సీల్లోనే స్టేడియంలో కనిపించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వన్డే మ్యాచ్ ను వదుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకే రోహిత్, కోహ్లి ఆస్ట్రేలియాలో ఆడబోతున్న వన్డే సిరీస్ పై అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి వెళ్లనుంది. అక్టోబర్-నవంబర్ మధ్య ఈ సిరీస్ జరుగుతుంది. లిమిటెడ్ ఓవర్ల సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ వన్డే సిరీస్ లో రోహిత్, కోహ్లి ఆడబోతున్నారు. దీంతో ఈ సిరీస్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో జరిగే ...