Hyderabad, మే 1 -- పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. అందులోనూ అది జవాన్ లాంటి మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తమిళ డైరెక్టర్ అట్లీతో కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తన నెక్ట్స్ మూవీపై అల్లు అర్జున్ గురువారం (మే 1) స్పందించాడు. ఓ ఈవెంట్లో న్యూస్9తో అతడు మాట్లాడాడు.

ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను తన నెక్ట్స్ మూవీ, అట్లీతో కలిసి పని చేయడం గురించి చెప్పాల్సిందిగా అడిగారు. దీనిపై బన్నీ స్పందిస్తూ.. "అవును.. ఇది నా 22వ సినిమా. జవాన్ తోపాటు సౌత్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన అట్లీతో చేస్తున్నాను. మేమిద్దరం కలిసి పని చేస్తున్నాం.

అతడు నాకు చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నట్లు నాకు అనిపించింది. ఇండియా సినిమాలో ఓ కొత్త విజువల్ వండర్ ను తీసుకొస్తామన్న ఆ...