Hyderabad, అక్టోబర్ 9 -- ప్రతీ ఏటా అట్లతద్దిని ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష తదియ నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ 9 గురువారం నాడు వచ్చింది. అట్లతద్దిని "ఉయ్యాల పండుగ" అని కూడా అంటారు. అట్లతద్ది నాడు కుజదోషం తొలగిపోవడానికి కూడా చాలా మంది పరిహారాలను పాటిస్తూ ఉంటారు. స్త్రీలు విశేషంగా జరుపుకునే పండుగలలో అట్లతద్ది ఒకటి. ఇది అచ్చమైన తెలుగింటి పండుగ.

అట్లతద్ది నాడు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలలు ఊగడం వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల వారు అట్లతద్దిని జరుపుకుంటారు. ఉత్తరాది వారు కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. పెళ్లి కాని యువతులు అట్లతద్ది నాడు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారు.

పెళ్లైన వారు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోము జరుపుతారు. అట్లు పంచి పెట్టడం, అట్లను నైవేద్యంగా పెట్టి తినడం, తెల్ల...