భారతదేశం, జూలై 10 -- తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తి ఒకే రోజు తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమ కొత్త సినిమాల అప్ డేట్స్ అందించారు. గురువారం (జూలై 10) అదిరిపోయే న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికలకు తమ కొత్త సినిమాల కబుర్లను అందించారు. ఇందులో కార్తి తన సినిమా పేరును కూడా అనౌన్స్ చేశాడు.

కుబేర లాంటి సూపర్ హిట్ తర్వాత తమిళ హీరో ధనుష్ చేయబోయే ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఆయన ఎవరితో సినిమా చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు ధనుష్ తెరదించారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ మూవీ చేయబోతున్నారు. డీ54 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. పోర్ తోజిల్ మూవీతో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా పాపులర్ అయ్యారు.

డీ54 మూవీ షూటింగ్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పూజ కార్యక్రమాలను...