భారతదేశం, నవంబర్ 13 -- అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన విషయంలో కఠినంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అటవీ భూములను ఆక్రమించినవారి పేర్లు, ఆక్రమించిన భూమి విస్తీర్ణం, కేసు స్థితితో సహా అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజల సౌలభ్యం కోసం వివరాలను పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అటవీ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్తు తరాల కోసం వాటిని సంరక్షించడానికి ప్రభుత్వం గట్టిగా ఉందని అన్నారు. 'అటవీ భూములు జాతీయ సంపద. చట్టాన్ని ఉల్లంఘించే వారు, ఎంత శక్తివంతమైన వారైనా, కఠినమైన చర్యలు ఎదుర్కొంటారు.' అని పవన్ అన్నారు.

పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం ఆధీనంలో దాదాపు 104 ఎకరాలు ఉన్నట్లు ఆరోపణలపై పవన్ ...