భారతదేశం, ఆగస్టు 7 -- లగ్జరీతో పాటు సెలబ్రిటీల జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గోవాలో సరదాగా గడపాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగణ్, కాజోల్ లగ్జరీ విల్లాలో మీరు బస చేయవచ్చు. గోవాలోని మాపుసాలో ఉన్న ఈ విల్లా పేరు 'విల్లా ఎటర్నా'. సంప్రదాయ పోర్చుగీస్ నిర్మాణం, ఆధునిక లగ్జరీల కలయికతో ఈ విల్లా అద్భుతంగా ఉంటుంది. విశాలమైన 5 పడక గదుల ఈ విల్లా నుంచి చుట్టూ ఉన్న పచ్చదనం, అందమైన ఉత్తర గోవా బీచ్‌లు, స్థానిక ఆకర్షణలను చూడవచ్చు.

నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు ఈ విల్లాను ఒక మంచి పర్యాటక కేంద్రంగా మార్చాయి. దీన్ని రెంట్‌కు తీసుకుని సెలబ్రిటీల జీవనశైలిని అనుభవించవచ్చు. ఈ విల్లాను తాజ్ హాలిడే విలేజ్ రిసార్ట్ అండ్ స్పా నిర్వహిస్తోంది.

అమెరికన్ వెబ్‌సైట్ Amastaysandtrails.com ...