భారతదేశం, జనవరి 15 -- శ్రీకాకుళం జిల్లా నైరాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలోని అగ్రికల్చరల్‌ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థుల జనవరి 27న హాజరు కావాల్సి ఉంటుంది.

అర్హతల విషయానికొస్తే.. బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా కావాలి. పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, నేరా, అగ్రికల్చర్‌ కాలేజ్‌‌లో 27-01-2026న ఇంటర్వ్యూ ఉంటుంది.

ఈ పోస్టు కోసం వచ్చేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పూర్తిగా తాత్కాలిక, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతారు. రెగ్యులర్ సిబ్బందిని భర్తీ చేసిన తర్వాత రద్దు చేస్తారు. విశ్వవిద్యాలయం/ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఏదై...