భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఆడియన్స్ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో 24 గంటల్లోపే స్టార్ట్ కానుంది. ఈ పాపులర్ రియాలిటీ షో తెలుగు కొత్త సీజన్ రేపు (సెప్టెంబర్ 7) సాయంత్ర 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. మరి సెలబ్రిటీలు ఎవరు? అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన కామన్ పీపుల్ ఎవరు? అనేది ఓ సారి చూద్దాం.

ఈ సారి బిగ్ బాస్ తెలుగులో కొత్తగా సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. దరఖాస్తుల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. వీళ్లతో అగ్ని పరీక్ష అంటూ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ 45 మంది నుంచి 15 మందిని జ్యూరీ నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఎంపిక చేశారు. వీళ్లలో నుంచి ఆరుగురు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ హౌస్ లోకి వెళ్లేందుకు సెలెక్ట్ అయినట్లు టాక్. ఇందులో మాస్క్...