భారతదేశం, డిసెంబర్ 10 -- సస్పెన్స్ కు తెరపడింది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యే వార్త ఇది. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ముందుగా అనౌన్స్ చేసిన షెడ్యూల్ కంటే ఒక వారం ఆలస్యంగా అఖండ 2 థియేటర్లకు రాబోతుంది. డిసెంబర్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ఉంటాయి.

అఖండ 2 సినిమాకు ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండి, చివరి నిమిషంలో వాయిదా పడిన నందమూరి బాలకృష్ణ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ కొత్త తేదీని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మంగళవారం రాత్రి తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రకటించింది.

వాయిదా తర్వాత వారం రోజులకు విడుదల అవుతుంది 'అఖండ 2' సినిమా. ఈ మూవీ కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ, "బాక్స్ ఆఫీస్ వద్ద దైవిక విధ్వంసానికి సిద్ధంగా ఉన్నారా? ...