భారతదేశం, డిసెంబర్ 10 -- అఖండగా మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి నందమూరి బాల‌కృష్ణ‌ వచ్చేస్తున్నారు. ఆయన డ్యుయల్ రోల్ ప్లే చేసిన అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. రేపు (డిసెంబర్ 11) ప్రీమియర్లు పడుతున్నాయి. కోర్టు కేసు కారణంగా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 విడుదల డేట్ మారింది. ఇది వేరే సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.

బోయపాటి శ్రీను-నందమూరి బాల‌కృష్ణ‌ కాంబోలో తెరకెక్కిన మరో మూవీ అఖండ 2. దీనిపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ తో హైప్ మరింత పెరిగిపోయింది. కానీ కోర్టు స్టే కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. మంగళవారం రాత్రి ఈ అనౌన్స్ మెంట్ చేశారు అఖండ 2 మేకర్స్.

అఖండ 2 రిలీజ్ అనౌన్స్ మెంట్ కొన్ని సినిమాలకు సడెన్ షాక్ లా తగిలింది. డిసెంబర్ 12న చాలా సినిమాలు థియేటర్...