భారతదేశం, డిసెంబర్ 9 -- నందమూరి బాల‌కృష్ణ‌ ఫ్యాన్స్ కు ఈ రోజు గుడ్ న్యూస్ అందే అవకాశముంది. అఖండ 2 రిలీజ్ డేేట్ పై ఇవాళ (డిసెంబర్ 9) ఒ క్లారిటీ రానుందని సమాచారం. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు మంగళవారం మేకర్స్ ఎండ్ కార్డు వేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈరోస్ ఇంటర్నేషనల్ తో చర్చలు ముగిశాయని తెలిసింది.

బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా అఖండ 2. ఇందులో మరోసారి అఖండగా బాల‌కృష్ణ‌ నట విశ్వరూపం చూపించారని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ పై మంగళవారం క్లారిటీ రాబోతుందని సమాచారం. అన్ని సమస్యలను నిర్మాతలైన 14 రీల్స్ ప్లస్ క్లియర్ చేసిందని తెలిసింది.

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్లు సోమవారం రాత్ర...