భారతదేశం, నవంబర్ 21 -- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్, పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగులు కామనే. అయితే అఖండ 2 ట్రైలర్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. ఈసారి ఆ మాస్ స్టోరీకి దేశభక్తి, సనాతన ధర్మం టచ్ ఇచ్చి మరో లెవెల్ కు తీసుకెళ్లారు. అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ పై సర్జికల్ స్ట్రైక్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

బాలకృష్ణ, సంయుక్త లీడ్ రోల్స్ లో నటిస్తున్న అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. రెండు వారాల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం (నవంబర్ 21) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిసారి అఘోరా రూపంలో బాలయ్య నట విశ్వరూపం చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కష్టం వచ్చినా దేవుడు రాడు అని జనం నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అవుతుందన్న డైలాగుతో అఖండ 2 ట్రైల...