భారతదేశం, డిసెంబర్ 4 -- గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నట సింహం నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో బాలయ్య-బోయపాటిలది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్‌ అని తెలిసిందే. సింహా నుంచి మొదలుపెడితే వీరి కాంబోలో లెజెండ్, అఖండ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి.

అంతేకాకుండా లెజెండ్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా బోయపాటి శ్రీను నంది అవార్డ్ కూడా అందుకున్నారు. అఖండ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో అది కూడా అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా అఖండ 2 తాండవం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 సినిమాను రూపొందించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవ...