భారతదేశం, డిసెంబర్ 5 -- నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'అఖండ 2' విడుదలకు బ్రేక్ పడటం అభిమానులను షాక్‌కు గురిచేసింది. డిసెంబర్ 5న (శుక్రవారం) గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రీమియర్స్ రద్దయ్యాయని, సినిమా వాయిదా పడిందని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం (డిసెంబర్ 14) అర్ధరాత్రి ప్రకటించింది. చివరి నిమిషంలో వచ్చిన ఈ ప్రకటనతో అప్పటికే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

అఖండ 2 సినిమా వాయిదా పడటంతో దేశవిదేశాల్లోని బాలయ్య అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు సినిమా చూడటానికి దూర ప్రాంతాల నుంచి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద జరిగిన ఒక ఘటన అభిమానుల ఆవేదనకు అద్దం పడుతోంది. "పాపం మా బ్రదర్ మనోజ్, అతని 10 ...