భారతదేశం, సెప్టెంబర్ 2 -- అఖండగా మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు నట సింహం నందమూరి బాల‌కృష్ణ‌. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు రికార్డు రేటు పలికినట్లు తెలిసింది.

బోయపాటి శ్రీను-నందమూరి బాల‌కృష్ణ‌ కాంబో అంటే ఉండే క్రేజే వేరు. సింహాతో మొదలు ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తున్నారు. లెజెండ్, అఖండతో అది మరో లెవల్ కు చేరింది. ఇప్పుడు అఖండ 2తో థియేటర్లను షేక్ చేసేందుకు వస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీ రైట్స్ కోసం కూడా ఫుల్ డిమాండ్ నెలకొంది.

అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ దక్...