భారతదేశం, నవంబర్ 14 -- అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా శుక్రవారం (నవంబర్ 14) ముంబైలో ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ లాంచ్ చేశారు. మూవీ టీమ్ మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొంది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం శక్తి, పరాక్రమాన్ని చూస్తారని చెప్పాడు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ అఖండ 2. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ కొట్టారు. దీంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ తాండవం లాంచ్ సందర్భంగా మూవీ గురించి బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అఖండ తాండవం మూవీలో హిందూ సనాతన ధర్మం గొప్పదనం, శక్తి, పరాక్రమాన్ని చూస్తారని చెప్పాడు. మన హిందూ ధర్మం ఎప్పుడూ సత్య మార్గంలోనే వెళ్లానని, అన్యాయానికి తల వంచకూడదని చె...