భారతదేశం, డిసెంబర్ 15 -- అఖండ 2: తాండవం చిత్రం మూడవ రోజు కూడా థియేటర్లలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇక్కడున్నాయి. అయితే సండే రోజు మాత్రం షాకింగ్ వసూళ్లు నమోదయ్యాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా ఆదివారం (డిసెంబర్ 14) బాక్సాఫీస్ దగ్గర తన జోరు కొనసాగించలేకపోయింది. ఈ మూవీ మూడో రోజు ఇండియాలో రూ.15 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. ఇది శనివారం వసూళ్ల కంటే తక్కువ. దీంతో మూడు రోజుల ఇండియా నెట్ వసూళ్లు రూ.61 కోట్లకు చేరాయని తెలిపింది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మార్కెట్ల మద్దతుతో మొదటి వారాంతంల...