భారతదేశం, జనవరి 12 -- బాక్సాఫీస్ దగ్గర ది రాజా సాబ్ కలెక్షన్ల బండి మెల్లగా సాగుతోంది. బలమైన ఓపెనింగ్ వసూళ్లు తర్వాత ఈ మూవీ జోరు కాస్త తగ్గింది. ఈ హారర్ థ్రిల్లర్ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అఖండ 2, మిరాయ్ లైఫ్ టైమ్ కలెక్షన్లనూ దాటింది.

ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ రిలీజైంది. బంపర్ స్టార్ట్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రాజా సాబ్ కాస్త స్లో అయింది. ఈ చిత్రం దాని ఓపెనింగ్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగారూ. 150 కోట్ల వసూళ్లను దాటింది. ఇది సంక్రాంతి నాటికి రూ.200 కోట్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు.

రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ది రాజా సాబ్ దాని ప్రార...