భారతదేశం, డిసెంబర్ 14 -- బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీపై ప్రీమియర్ షోల నుంచే దారుణమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలుసు కదా. ఇందులో బాలయ్యను చూపించిన విధానంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఇది మంచి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. అయితే దీనిపై తాజాగా బోయపాటి శ్రీను స్పందించాడు.

అఖండ 2 మూవీపై వస్తున్న ట్రోల్స్ పై ఓ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడాడు. బాలకృష్ణను ఈ సినిమాలో ఎందుకు అలా చూపించామో వివరించాడు. నిజానికి మొదటి రీల్లోనే ఆయన అష్ట సిద్ధి సాధించాడని చెప్పి లాజిక్ కూడా ఇచ్చినట్లు తెలిపాడు.

"ఆయన అష్ట సిద్ధి సాధించినవాడు. 12 ఏళ్ల పాటు అష్ట దిగ్బంధనానికి వెళ్లి అష్ట సిద్ధి సాధించాడు. అఖండ ఓ సూపర్ హ్యూమన్. వాళ్లకసలు లాజిక్కా, మ్యాజిక్కా అనేది తీసేస్తే.. వాళ్లు సూక్ష్మ రూపంలోకి లేదంటే విశ్వరూపంలోకి కూడా వెళ్లగలరు. కానీ అవన...