భారతదేశం, అక్టోబర్ 28 -- కార్తీకమాసం చాలా విశిష్టమైనది. కార్తీకమాసంలో చేసే దీపారాధనకు, నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటాము. ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు పాటించాల్సిన వాటి గురించి, పూజా విధానాన్ని తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, కార్తీక శుక్ల నవమి తిథి అక్టోబర్ 30 ఉదయం 10:06 కి మొదలవుతుంది. అక్టోబర్ 31 ఉదయం 10:03 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి అక్టోబర్ 31న అక్షయ నవమిని జరుపుకోవాలి. ఈరోజు శుభ యోగాలు కూడా ఏర్పడతాయి.

అక్షయ నవమి నాడు వృద్ధి యోగం, రవి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది.

అక్షయ నవమి లేదా ఉసిరి నవమి నాడు పూజ చేసుకోవడానికి సరైన సమయం ...