Hyderabad, ఏప్రిల్ 16 -- అక్షయ తృతీయ వచ్చేస్తోంది. ఆరోజు బంగారం కొనడం వల్ల అన్ని రకాలుగా మేలు జరుగుతుందని నమ్ముతారు. అయితే బంగారం రేటు కొండెక్కి కూర్చొంది. తులం బరువున్న జ్యూయలరీ కావాలంటే కనీసం లక్ష ముప్పైవేల రూపాయలకు పైగా ఖర్చు చేయాలి. యాభై వేల రూపాయల బడ్జెట్‌లోనే మీరు చిన్న చిన్న బంగారు వస్తువులను తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి వస్తువుల్ని ఎంపిక చేసుకోవాలో తెలుసుకోండి.

50వేల బడ్జెట్‌లోనే మీకు బంగారు నాణాలు దొరుకుతాయి. 24 క్యారెట్లలో ఉంటాయి. ఈ 24 క్యారెట్ల బంగారు నాణాన్ని తీసుకుంటే దాన్ని ఇంట్లోనే భద్రపరచుకోవచ్చు. మీ దగ్గర మరికొంత సొమ్ము కూడినప్పుడు ఈ బంగారు నాణాన్ని ఇచ్చి అదనపు సొమ్మును చెల్లించి ఏదైనా వస్తువుని తీసుకుని అవకాశం ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు రూ.50,000 ఖర్చుపెట్టగలిగితే వీలైనంతవరకు 24 క్యారెట్ల బంగారు నాణాన్ని తీసుకో...