Hyderabad, ఏప్రిల్ 25 -- అక్షయ తృతీయ రోజు బంగారం కొనే ఆచారం ఎన్నో ఏళ్లుగా వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు పెరగడంతో చాలామంది ఏం కొనాలో తెలియక ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇరవైవేల రూపాయలు బడ్జెట్లోనే ఏదైనా బంగారు వస్తువు తీసుకునేందుకు ప్లాన్ చేస్తారు. అలాంటివారి కోసం ఇక్కడ మేము కొన్ని ఐడియాలు ఇస్తున్నాము. అక్షయ తృతీయ రోజు బంగారు నాణేలు లేదా మిక్స్ అండ్ మ్యాచ్ ఆభరణాలు వంటివి తీసుకోవచ్చు.

బంగారం సాంప్రదాయకంగా వస్తున్న ఆభరణం. అలాగే ప్లాటినం, వెండి కూడా ఎంతో మంచిది. కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అక్షయ తృతీయ రోజు కొనాలని లేదు. వెండితో చేసిన వస్తువులు కూడా కొనవచ్చు. మీకు రూ.20,000 బడ్జెట్లోనే వెండి వస్తువు కచ్చితంగా వస్తుంది. అలాగే వెండికి పైన బంగారం పూత పూసిన వస్తువులు కూడా లభిస్తున్నాయి. ఇవి 20వేల బడ్జెట్లోనే మీకు లభిస్తాయి. వెండిపై బంగారం పూత...