భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తక్షణమే ఈ అక్రమ అమ్మకాలను అరికట్టాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

యూరియా సంచీని రైతులకు రూ. 265కే అందిస్తున్నామని, ఒక సంచీపై కేంద్రం రూ. 2,200 నుంచి రూ. 2,400 సబ్సిడీ ఇస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. ఒక సంచీ అసలు ధర రూ. 2,650 వరకు ఉంటుందని తెలిపారు. కానీ ఈ యూరియా అక్రమంగా బ్లాక్ మార్కెట్‌లో రూ. 400కు అమ్ముతున్నారని ఆరోపించారు.

"రైతులు అవసరానికి మించి యూరియాను నిల్వ చేసుకోకూడదు. అవసరమైనంత వరకే ఉపయోగించాలి" అని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని పెంచామని, స్థానిక అవసరాలను తీర్చడానికి ఇ...