భారతదేశం, మే 25 -- వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.
ఈ కేసులో అరెస్టు భయంతో గత కొంతకాలంగా కాకాణి పరారీలో ఉన్నారు. ఆయన కేరళలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం కాకాణిని నెల్లూరు తీసుకొచ్చే అవకాశం ఉంది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిలో భారీగా క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని మైనింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
క్వార్ట్జ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.