భారతదేశం, నవంబర్ 20 -- అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఉదయంపూట విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా వెళ్లారు. కొంతమంది అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దీంతో కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చాయి.

జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత జగన్ కోర్టుకు హాజరు అయ్యారు. నాంపల్లి కోర్టుకు ఉదయం 11.40 గంటలకు వచ్చి.. పన్నెండున్నర దాకా ఉండి వెళ్లిపోయారు. జగన్‌తో వచ్చిన కొంతమంది ముఖ్యనేతలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు వద్దే ఉన్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లకు సంబంధించ...