Hyderabad, సెప్టెంబర్ 6 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, డబ్బు మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధైర్యం, భూమి మొదలైన వాటికి కారకుడు. జ్యోతిష లెక్కల ప్రకారం బుధ, కుజుల సంయోగం తులా రాశిలో అక్టోబర్ నెలలో ఏర్పడనుంది.

ఈ రెండు గ్రహాల కలయిక మంచి ఫలితాలని తీసుకువస్తుంది. ద్వాదశ రాశుల వారిపై ఈ ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం అనేక లాభాలు ఉంటాయి. బుధ, కుజుల సంయోగంతో ఏయే రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వ...