భారతదేశం, మే 24 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రానున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో హరి హర వీరమల్లు సినిమా ప్రీమియర్ల బుకింగ్స్ అమెరికాలో మొదలయ్యాయి.

హరి హర వీరమల్లు సినిమా ప్రీమియర్ల అడ్వాన్స్ టికెట్ల బుకింగ్‍కు అమెరికాలో సూపర్ క్రేజ్ కనిపిస్తోంది. భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం బుకింగ్‍లకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఒక్క రోజులోనే 3లక్షల డాలర్ల విలువైన టికెట్ అమ్ముడయ్యాయి. ఇంకా జోరు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ప్రీమియర్లకు భారీ కలెక్షన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ట్రెం...