Hyderabad,telangana, అక్టోబర్ 11 -- డిగ్రీ, పీజీ ప్రవేశాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 10వ తేదీతో గడువు పూర్తి కాగా. మరోసారి పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు.అక్టోబర్ 15వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తాజాగా ప్రకటన విడుదల చేసింది.

చాలా రోజులుగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు గడువు ముగిసినప్పటికీ.. అధికారులు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరో ఐదు రోజుల పాటు పొడిగించారు.

2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు కూడా ఇదే వెబ్ సైట్ లో పొందుపరిచారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చ...